వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:46 PM
వచ్చే ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. డీ లిమిటెషన్ జరిగితే తుంగతుర్తిలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. డీ లిమిటెషన్ జరిగితే తుంగతుర్తిలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ ఈరోజు (శనివారం) చిట్‌చాట్ చేశారు. హుజూర్‌నగర్ నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు.
తుంగతుర్తిలోని తాను పుట్టిన స్వగ్రామం తాటిపాములలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీల్లో మొత్తం డిజైన్ సమస్య అయితే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని తేల్చిచెప్పారు. నిర్మాణ సంస్థల పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్లే నిధులు ఖర్చు చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\
Read Latest Telangana News And AP News And National News
And Telugu News