హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:07 AM
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో తెలంగాణ సర్కార్ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్లను పునర్వ్యవస్థీకరణ చేసింది.
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో తెలంగాణ సర్కార్ భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్లను పునర్వ్యవస్థీకరణ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు చేసింది. కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులు ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేసింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలు మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేసింది. మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధుల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును శంషాబాద్ పీఎస్‌గా మార్చింది. శంషాబాద్ డివిజన్‌లో ఆర్‌జీఐఏ పీఎస్, శంషాబాద్ పోలీస్ స్టేషన్‌ల పునర్వ్యవస్థీకరణను చేసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్ ప్రాంతాల పోలీస్ పరిధుల్లో మార్పులను చేపట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ ప్రాంతాల్లోనూ పరిధుల్లో పునర్విభజన చేసింది. ట్రాఫిక్ పోలీస్ పరిధిలోనూ జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోనూ కొత్తగా జోన్లను కేటాయించింది. జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్-84 ద్వారా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సంగారెడ్డి జిల్లాలో పోలీసింగ్ పునర్వ్యవస్థీకరణ
సంగారెడ్డి జిల్లాలో పోలీసింగ్ పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిన్నారంలో కొత్త పోలీస్ సబ్-డివిజన్ ఏర్పాటు చేసింది. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధి పూర్తిగా జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చింది. నూతనంగా గుమ్మడిదల పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేసింది. పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో కొత్త పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం
దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు
ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News