Share News

అమీర్‌పేటలో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Sep 30 , 2026 | 07:20 AM

హైదరాబాద్ అమీర్‌పేట లాడ్జిలో శిరీష అనే మహిళ మంగళవారం దారుణ హత్యకు గురైంది. ఆమెను ప్రియుడు శ్రీనివాస్ చంపేసిన తర్వాత పరారయ్యాడు. నిందితుడి కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు.

అమీర్‌పేటలో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం
Ameerpet Woman Incident

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రియురాలు శిరీష (34)ను ఓ రాడ్డుతో కొట్టి ప్రియుడు శ్రీనివాస్ చంపేశాడు. ఈ హత్య అనంతరం గదికి తాళం వేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన శిరీష, ప్రియుడు శ్రీనివాస్ కలిసి అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ నెల 24వ తేదీన గణేశ్, దుర్గా అనే మారుపేర్లతో హోటల్‌లో వీరిద్దరు దిగారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీనివాస్ హోటల్ నుంచి పరారయ్యాడు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా శిరీష బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.


ఈ క్రమంలో మరో తాళంతో గది తెరిచి చూడగా బెడ్‌పై శిరీష మృతదేహం కనిపించింది. కర్టెన్ రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గదిలో టీవీ శబ్దం పెంచి దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శిరీష శరీరంపై పలు చోట్ల గాయాలను గుర్తించారు. హత్య అనంతరం ఆమె వద్ద ఉన్న డబ్బును అతడు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు రెండు రోజుల ముందే ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు.


ఈ దాడి అనంతరం ఎల్లారెడ్డిగూడలోని ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించాడు. ఆస్పత్రిలోనూ మారుపేర్లతో వివరాలు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌పై గతంలోనూ యువతులను వేధించిన కేసులు ఉన్నట్లు సమాచారం. నిందితుడు శ్రీనివాస్ కోసం ఎస్సార్‌నగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ చేతిలో కీలుబొమ్మగా సీఈసీ.. మల్లికార్జున ఖర్గే ధ్వజం

మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను గుర్తించండి.. డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు

దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 08:24 AM