దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదు: మంత్రి పొన్నం
ABN , Publish Date - Sep 29 , 2026 | 10:55 AM
దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ తమ తమ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ తమ తమ దేవుళ్లపై విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు శివుడు ఆరాధ్య దైవమని ఉద్ఘాటించారు.
ఇతరుల విశ్వాసాలను గౌరవించడం మన సంస్కృతి అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్న విషయం ఇదేనని తెలిపారు. దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. వేములవాడ రాజన్న, భద్రాద్రి రాముడు, కొండగట్టు ఆంజనేయస్వామి ఇలా అన్ని దేవాలయాలపై తమకు గౌరవం, విశ్వాసం ఉందని వివరించారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ, ఆలయాలను అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News