Share News

భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు

ABN , Publish Date - Sep 28 , 2026 | 08:01 AM

భాగ్యనగరంలో అర్ధరాత్రి వేళ మైకుల మోతపై సిటీ పోలీసులకు సినీనటుడు అల్లు శిరీశ్ ఎక్స్ (X) వేదికగా ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభా నగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తోందని పేర్కొన్నారు.

భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
Actor Allu Sirish

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో అర్ధరాత్రి వేళ మైకుల మోతపై సిటీ పోలీసులకు సినీనటుడు అల్లు శిరీశ్ ఎక్స్ (X) వేదికగా ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తోందని పేర్కొన్నారు. రోజువారీగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్ధంతో మైకులు మోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ప్రస్తావించారు.


అయితే, వినాయక నిమజ్జనం వరకు సర్థుకుపోవాలని తనకు పోలీసులు సూచించారని అల్లు శిరీశ్ అన్నారు. సెప్టెంబర్ 25వ తేదీతో గణేశ్ నిమజ్జనం పూర్తి అయినా ఇంకా ఆలయంలో మైకుల శబ్ధం తగ్గకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిద్రలేక స్థానిక వయోవృద్ధులు, చిన్న పిల్లలు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకోవాలని అల్లు శిరీశ్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 08:56 AM