Share News

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:38 PM

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను అత్యంత దారుణంగా భర్త హత్య చేశాడు. ఆమె తలపై రోకలిబండతో దాడి చేసి చంపేశాడు.

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Chikkadpally Wife Case

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను అత్యంత దారుణంగా భర్త హత్య చేశాడు. ఆమె తలపై రోకలిబండతో దాడి చేసి చంపేశాడు. సమాచారం అందగానే చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలు తేజశ్రీ (26), నరేందర్ నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి వలస వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని హోటల్లో అకౌంటెంట్‌గా అతను పనిచేస్తున్నాడు. తేజశ్రీ గృహిణి. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు రోహిత్ ఉన్నాడు. భార్యను హత్య చేసిన అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భర్త లొంగిపోయాడు. పులివెందులకు చెందిన నరేందర్, అన్నమయ్య జిల్లాకు చెందిన తేజశ్రీలకు 2020లో వివాహం జరిగింది. పుట్టింటికి వెళ్తానని భార్య చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నరేందర్ ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 07:48 PM