Share News

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:06 PM

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడమెంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ విష సంస్కృతి అనే ధ్వజమెత్తారు.

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్
Jagtial MLA Sanjay Kumar

జగిత్యాల, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Jagtial MLA Sanjay Kumar) హాట్ కామెంట్స్ చేశారు. దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడమెంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ విష సంస్కృతినే అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సంస్కృతి జగిత్యాలకు కూడా పాకిందని తెలిపారు. వినాయకుడి దగ్గర పార్వతి, శివుడి పాటలు పెట్టాలని అన్నారు.


కనీసం గణేశ్ వాహనం ఎలుక గురించి పాడిన అభ్యంతరం లేదని ఎమ్మెల్యే సంజయ్ చెప్పుకొచ్చారు. రాజకీయ నేతల పాటలు పెడితే పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దేవుడి పాటల విషయంలో రాజకీయాలు వద్దని చెప్పారు. ‘నేను రేవంత్‌రెడ్డితో కలిసి పని చేస్తున్నా.. అంత మాత్రానా జై రేవంత్‌రెడ్డి’ అని అనాల్సిన పని లేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 12:30 PM