Share News

గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:42 PM

గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 22 మంది నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.

గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
Sohrabuddin Encounter Case

ఢిల్లీ, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో (Sohrabuddin Encounter Case) సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. 22 మంది నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ పోలీసులతో సహా 21 మంది పోలీసుల నిర్దోషిత్వ విడుదలపై సీజేఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఏకంగా 92 మంది సాక్షులు మాట మార్చడంపై జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణ జరిగిందా.? లేదా.? తేలుస్తామని పేర్కొన్నారు.


సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్ బీ, తులసీరామ్ ప్రజాపతి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో 92 మంది సాక్షులు మాట మార్చడం (హోస్టైల్ కావడం) తీవ్ర విచారకరమని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో అసలు బాధితులకు సరైన, నిష్పాక్షికమైన విచారణ జరిగిందో.? లేదో.? పరిశీలిస్తామని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు. మొత్తం రికార్డులను పరిశీలించబోమని, అత్యంత కీలకమైన ముగ్గురు లేదా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను సమర్పిస్తే.. విడుదలపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బాగ్చీ వెల్లడించారు. 2018 నాటి సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల తీర్పును గతంలో బాంబే హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు నోటీసులతో ఈ కేసు పున:పరిశీలనకు వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 01:56 PM