ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:10 AM
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రభావం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ (Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రభావం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండదని స్పష్టం చేశారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో.. అలా రిజల్ట్స్ ఉంటాయని కుండ బద్దలు కొట్టారు.
బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోంది..
బీజేపీ సీఈసీని అడ్డంపెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతోందని దానం నాగేందర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓటు చోరీతోనే గెలిచారని ఆరోపణలు చేశారు. ఓటు చోరీకి పాల్పడకపోతే కిషన్‌రెడ్డి అసలు గెలిచేవారే కాదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోనైనా జ్ఞనేశ్ కుమార్‌ను తొలగించాలని దానం నాగేందర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News And AP News And National News
And Telugu News