ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:46 PM
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతరులకు మార్గదర్శకాలు ఇచ్చే ముందు మనం అద్దంలో చూసుకోవాలని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ పవర్ ఫుల్ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతరులకు మార్గదర్శకాలు ఇచ్చే ముందు మనం అద్దంలో చూసుకోవాలని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ పవర్ ఫుల్ కామెంట్స్ చేశారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ల కాలయాపనపై విచారణ సందర్భంగా న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. కోర్టుల్లో ఆయా పెండింగ్ కేసులను గుర్తు చేస్తూ ఫిరాయింపుల నిరోధక చట్టం విచారణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్లకు కఠిన కాలపరిమితి విధించే ముందు కోర్టుల్లో ఉన్న కేసుల పెండెన్సీని కూడా గుర్తించాలని వ్యాఖ్యానించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోకపోవడంపై ఈరోజు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించినా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే సమయంలో న్యాయస్థానాల్లోనూ కేసుల ప్రక్రియ వేగవంతం కావాలని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News And AP News And National News
And Telugu News