మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను గుర్తించండి.. డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:14 PM
తెలంగాణ అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనపై దాఖలైన పిటీషన్‌పై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనపై దాఖలైన పిటీషన్‌పై రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) ఈరోజు (మంగళవారం) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను వెంటనే గుర్తించాలని డీజీపీని ఆదేశించింది. పోలీసులపై చర్యల నివేదికను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుంచాలని హుకుం జారీ చేసింది.
స్పీకర్ ఆదేశం మేరకే పోలీసులు వ్యవహరించి ఉంటే.. అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అనుచితంగా వ్యవహరించినట్లు ఆధారాలు ఏమి లేవని చెప్పింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం సవరించింది. అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్‌కు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News