Share News

ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:25 PM

హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి కామన్ ట్రావెల్ పాస్ నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ పాస్ జారీ చేస్తారని వెల్లడించారు. ORR పరిధిలోని సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చని చెప్పుకొచ్చారు.

ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి కామన్ ట్రావెల్ పాస్ ఈరోజు (శుక్రవారం) నుంచి అందుబాటులోకి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తెలిపారు. అన్ని మెట్రోస్టేషన్లలో ఈ పాస్ జారీ చేస్తారని వెల్లడించారు. ఈ పాసుతో ORR పరిధిలోని సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణించవచ్చని చెప్పుకొచ్చారు. ఈ కామన్ పాసుపై సీఎం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


ORR పరిధిలోని సిటీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటవుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బస్సు – మెట్రోకు ఇక రెండో టికెట్ అవసరం లేదని తెలిపారు. 25 లక్షలకు పైగా బస్సు ప్రయాణికులకు ఈ కామన్ పాసుతో ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చారు. 4.5 లక్షల మంది మెట్రో ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మెరుగైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై తాము ఫోకస్ పెట్టామని అన్నారు. ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశామని తెలిపారు. హైదరాబాద్‌ను ‘ఫాస్టెస్ట్ సిటీస్’లో ఒకటిగా మార్చడమే CURE లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


కాగా, ఆర్టీసీ బస్ - మెట్రో రైల్ కలిపి రోజు, నెల వారి పాసులను సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ జారీ చేసింది. ఆర్టీసీ మెట్రో రైల్ జాయింట్ పాసుతో ఆర్టీసీ బస్సు, మెట్రో రైల్లో ప్రయాణించే సదుపాయం కల్పించింది. రోజు వారి పాస్ రూ.400, నెల వారి పాస్ రూ.8500 ఖరారు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. కండక్టర్‌తో పని లేకుండా మొబైల్లోనే టికెట్ పొందే సదుపాయం కల్పించింది. ఫిజికల్ టికెట్ అవసరం లేకుండా మొబైల్లోనే టికెట్ పొందే సదుపాయం తీసుకువచ్చింది. వారం రోజుల పాసును సైతం ఆర్టీసీ తీసుకువచ్చింది. మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్లోనే రోజు వారి టికెట్, డే పాస్, వారం, నెల వారి బస్ పాసులను పొందే సదుపాయాన్ని రాష్ట్ర సర్కార్ కల్పించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 02:14 PM