Home » Metro News
హైదరాబాద్ మెట్రో రైల్.. శుక్రవారం నాటికి ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 57 మెట్రోస్టేషన్లతో.. ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణస్తున్నారు. అయితే... పెరిగిన అవసరాల నేపధ్యంలో ఈ మెట్రో రైళ్ల సేలలను ఇంకా విస్తరింపజేయాల్సిన అంసరం ఉంది.
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
హైదరాబాద్ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణ సమయాల్లో సవరణ చేసినట్లు ప్రకటించారు. సవరించిన ప్రయాణ వేళలు నవంబరు మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
నగరంలోని మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లు, కొత్త రైళ్లను ఇప్పట్లో తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎల్‌అండ్‌టీ నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో అదనపు కోచ్‌ల ఏర్పాటు మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యేట్లు కనిపిస్తోంది.
దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని సిటీ బస్సులు బంద్ కావడంతో సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
ఒకవైపు వర్షాలు.. మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్‌లు.. నగరంలో అడుగు ముందుకు వేయాలంటే అడుగడుగునా అడ్డంకులు. ఐటీ కారిడార్‌లోనే కాకుండా కోర్ సిటీలోనూ ట్రాఫిక్ జామ్‌లు, ధ్వంసమైన రోడ్లపై ప్రయాణం నరకరంగా మారింది.
ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుందని తెలిపారు.
స్థానిక వడపళని రైల్వేస్టేషన్ పైభాగంలో రెండో దశ నిర్మాణపనుల కారణంగా గ్రీన్ లైన్ మార్గంలో మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు జరిగాయి. కోయంబేడు నుంచి అశోక్ నగర్ వరకు మెట్రోరైలు సేవల్లో ఈ నెల 15 నుంచి 19వ తేది వరకు తాత్కాలికంగా మార్పులు చేశారు.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల నిర్మాణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఈ నెల 18న టెండర్లు తెరవాల్సి ఉంది. అయితే ఇటీవల ఏపీఎంఆర్సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు.
హైదరాబాద్ మెట్రో రైలులో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో వాటిని అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య ఈ గ్రీన్ చానల్ చేపట్టారు.