Viral Video: ట్రైన్‌లో వ్లాగర్ చేసే వింత చేష్టలకు పడి పడి నవ్వుతారు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 03 , 2026 | 01:08 PM
సాధారణంగా రైళ్లలో కొంత మంది ప్రయాణికులు చేసే వింత చేష్టలకు ఆశ్చర్యంతో పాటు నవ్వొస్తుంది. ఒక వ్లాగర్ ట్రైన్‌లో విచిత్రంగా ప్రవర్తించడం చూసి పక్క ప్రయాణికులు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో మెట్రో రైలులో కొంతమంది ప్రయాణికులు చేస్తున్న విచిత్ర చేష్టలు చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. రీల్స్, యూట్యూబ్ వీడియోల కోసం చేస్తున్న వింత చేష్టలు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినా.. తోటి ప్రయాణికులు మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అలాంటి ఘటన ఒకటి ముంబై లోకల్ ట్రైన్‌లో చోటు చేసుకుంది. ఒక వ్లాగర్ రైలు కంపార్ట్ మెంట్‌లో కూర్చొని అల్లంపై టమాటా కచప్ వేసుకొని తింటాడు. అది చూసి పక్కనే ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోవడం వీడియోలో చూడొచ్చు.
అరటిపండును టీలో కలుపుకొని తింటాడు, క్యాబేజీ, వంకాయను పచ్చిగానే తింటూ ప్రయాణికులతో ముచ్చటిస్తుంటాడు. వ్లాగర్ పచ్చి కూరగాయలను అలా తింటూ ఉన్న సమయంలో ఒక ప్రయాణికుడు ఎందుకు అలా తింటున్నావు అని ప్రశ్నిస్తాడు. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతాడు వ్లాగర్. ఈ రీల్ ని ప్రణయ్ జోషి షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘పచ్చి కూరగాయలు అలా ఎలా తింటున్నావ్ బ్రో’అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల