Share News

శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌గా మెట్రో స్టేషన్ పేరు మార్పు

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:44 PM

ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్‌‌ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌గా మెట్రో స్టేషన్ పేరు మార్పు
Delhi Metro station

న్యూఢిల్లీ: ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్‌‌ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఒక ప్రకటనలో తెలిపింది. పేరు మార్పు కోరుతూ స్థానికుల నుంచి చిరకాలంగా వస్తున్న విజ్ఞప్తులు, ప్రయాణికులను ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పు చేసినట్టు చెప్పింది.


ఢిల్లీలోని స్టేట్ నేమ్స్ అథారిటీ (ఎస్ఎన్ఏ) సిఫారసుల మేరకు మెట్రో స్టేషన్ పేరు మార్పు జరిగనట్టు మీడియా కథనాలు వచ్చాయి. ముఖ్యమంత్రి సారథ్యంలో 29 మంది సభ్యులు ఈ ఎస్‌ఎన్ఏలో ఉన్నారు. వీధులు, పార్కులు, కాలనీలు, ఢిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటరీలోని ల్యాండ్‌మార్కులకు పేర్లుపెట్టడం, పేర్ల మార్పుపై ఎస్ఎన్ఏ నిర్ణయాలు తీసుకుంటుంది.


మయూర్ విహార్ ఏరియాలో రెండు మెట్రో స్టేషన్లు ఉన్నారు. ఒకటి మయూర్ విహార్ పాకెట్ 1 కాగా, మరొకటి మయూర్ విహార్ ఫేజ్ 1. ఒకే తరహా పేర్లు ఉండటంతో ప్రయాణికులు గందరగోళానికి గురై ఒక స్టేషన్‌కు బదులుగా మరో స్టేషన్‌లో దిగిన సందర్భాలు తరచు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, బయట స్టేషన్ల నుంచి వచ్చే కొత్త ప్రయాణికులకు ఇది ఇబ్బందికరమవుతోంది.

Updated Date - Feb 07 , 2026 | 07:53 PM