Share News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:27 PM

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు
Naxals Surrender

బస్తర్: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారం నాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్‌షా రాయపూర్ వచ్చిన రోజునే ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


కాగా, బీజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయారని ఎస్పీ సుందరరాజ్ తెలిపారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి కార్డెక్స్ వైర్లు, జెలటిన్ స్టిక్‌లో స్వాధీనం చేసుకున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.50వేల తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. కాగా, తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రత, గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావసం కల్పిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ కోరారు.


ఇవి కూడా చదవండి..

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 07 , 2026 | 07:33 PM