Share News

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

ABN , Publish Date - Feb 07 , 2026 | 05:44 PM

భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు మోదీకి ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్‌లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు.

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
PM Modi in Kuala Lampur

కౌలాలంపూర్: మలేసియా (Malaysia)లో త్వరలో కొత్త కాన్యులేట్ ఏర్పాటు చేయనున్నట్టు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. రెండ్రోజుల మలేసియా పర్యటన నిమత్తం శనివారంనాడు కౌలాలంపూర్ చేరుకున్న ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్‌లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు.


భారత్ పదేళ్లలో వేగంగా సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా మోదీ వివరిస్తూ, పదేళ్ల క్రితం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రస్తుతం మూడో స్థానానికి చేరిందన్నారు. ఇండియాలో చదువుకునే విద్యార్థులకు త్వరలోనే తిరువళ్లువర్ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పారు. యూకే, యూఏఈ, అస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, విశ్వాసం భారతదేశపు బలమైన కరెన్సీగా మారిందని పేర్కొన్నారు.


అభివృద్ధికి విశ్వసనీయ భాగస్వామిగా..

ఇండియాను ఒక పెద్ద మార్కెట్‌గానే గతంలో చూసేవారని, ఇప్పుడు పెట్టుబడులు, వాణిజ్యానికి హబ్‌గా మారిందని మోదీ తెలిపారు. అభివృద్ధికి విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ నిలుస్తోందన్నారు. యూకే, యూఏఓ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, యూఎస్ఏ సహా అనేక దేశాలు ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు.


మలేసియాను ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ప్రవాస జనాభాను కలిగిన రెండో దేశంగా మోదీ పేర్కొన్నారు. భారత్-మలేసియా ప్రజల హృదయాలను కలుపుతూ, రెండు దేశాల మధ్య వారధిగా ప్రవాస భారతీయులు నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆహారపు అలవాట్లు, భాషా పరంగా ఎన్నో ఇరుదేశాల ప్రజల మధ్య ఎన్నో సామీప్యాలు ఉన్నాయని అన్నారు. భారతీయ సంగీతం, చలనచిత్రాలకు మలేసియాలో ఎంతో ఆదరణ ఉన్నట్టు విన్నానని, ప్రధాని అన్వర్ ఇబ్రహీం కూడా బాగా పాడతారనే విషయం ఇక్కడి వారందరికీ తెలిసిందేనని అన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన చాలామందికి ఈ విషయం తెలియదని, తాను గత పర్యటనలో ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ఇండియాలోని పాపులర్ హిందీ గీతాలను అన్వర్ ఇబ్రహీం ఆలపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయని, లెజెండ్రీ ఎంజీఆర్ తమిళ పాటలను ఆయన బాగా ఇష్టపడతారని అన్నారు.


దీనికి ముందు, భారత్‌కు చెందిన 800 మందికి పైగా నృత్యకారులు ప్రధానికి విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. భారత సంతతి ఆత్మీయ సమ్మేళనం వద్ద 'భారత్ మాతా కీ జై', 'మోదీ, మోదీ' అనే నినాదాలతో ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఇవి కూడా చదవండి..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

అరేబియా సముద్రంలో చమురు స్మగ్లింగ్.. ఆట కట్టించిన కోస్ట్ గార్డ్..

Updated Date - Feb 07 , 2026 | 09:44 PM