రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:34 AM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతలు దొంగలేనని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని నేతలు దొంగలేనని ఆరోపించారు. ఈరోజు (శుక్రవారం) సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురంలో మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టుకు వారు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
సోమవారం వరకు వారిద్దరూ ఉత్తరం రాయకపోతే స్వయంగా తానే హైకోర్టుకు ఈ విషయంపై ఉత్తరం రాస్తానని ఎంపీ రఘునందన్ తెలిపారు. లేదంటే మన ముగ్గురం వెళ్లి హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం ఇద్దామని చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై కూడా విచారణ జరపాలని ఉత్తరం ఇస్తానని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం
దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు
ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News