తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:14 PM
రాష్ట్రంలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం పెంపునకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయం పెంపునకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భూముల విలువ పెంపు, సమర్థ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు.
పర్యాటక ప్రాజెక్టుల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలి..
పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని భట్టి విక్రమార్క మార్గనిర్దేశం చేశారు. రాబోయే గ్లోబల్ సమ్మిట్ కోసం 70 నుంచి 80 పర్యాటక ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో తెలంగాణ పర్యాటక రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 11 చారిత్రక కోటల అభివృద్ధికి పీపీపీ విధానంలో బిడ్లు ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు. టైగర్ టూరిజం కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో కారవాన్ పార్కుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
HILT పాలసీలో అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. HILT పాలసీపై పరిశ్రమలకు అవగాహన కోసం ఆరు పార్కుల్లో రోడ్‌షోలు నిర్వహించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. ప్రధాన పర్యాటక ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నిజాంసాగర్‌లోని నిజాం గెస్ట్‌హౌస్‌ను పర్యాటక అవసరాలకు వినియోగించే అంశంపై పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\
Read Latest Telangana News And AP News And National News
And Telugu News