Share News

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:24 PM

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా అధికారులు ప్రతి వారం సమీక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎంవో అధికారులతో శనివారం MCHRDలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా అధికారులు ప్రతి వారం సమీక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎంవో అధికారులతో ఈరోజు (శనివారం) MCHRDలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నిర్మాణంలోని ప్రధాన ఆస్పత్రులపై సీఎం ఆరా తీశారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆస్పత్రుల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు.


ఆస్పత్రులనూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి..

వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను ముందుగానే గుర్తించాలని సీఎం సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలును వేగవంతం చేయాలని నిర్దేశించారు. ఆయా ఆస్పత్రులు పూర్తయ్యే నాటికి అన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను అధికారులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. జిల్లాల్లోని ఆస్పత్రులనూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.


డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్..

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడులపై పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 03:44 PM