Share News

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:06 PM

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి
Kishan Reddy

మెదక్ జిల్లా, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన తొలి అత్యాధునిక ప్లాంట్‌కు (సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్ట్) భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ​ఎంపీ రఘునందన్ రావు, కంపెనీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.

KISHAN-REDDY-2.jpg


రూ.400 కోట్లతో అమూల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు..

తెలంగాణ నడిబొడ్డున తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ఏర్పాటుకు భూమి పూజ చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిశ్రమతో స్థానిక యువత, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. తెలంగాణలో ఇలాంటి పరిశ్రమలు రావడం సంతోషకరమైన విషయమని చెప్పారు. గ్రామాల్లో కో ఆపరేటివ్ సోసైటీలో రాజకీయాలు చేరిపోయి నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. ఈ సహకార సంఘాలను పునర్నిర్మాణం చేసుకోవాలని సూచించారు. రైతులంతా కలిసి ఓ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

KISHAN-REDDY-3.jpg


పాల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి..

సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మెరుగుపరుస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. కేంద్రప్రభుత్వం కొత్తగా కో ఆపరేటివ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గతంలో ఈ శాఖ లేదని.. దీని ప్రాధాన్యం గుర్తించి అమిత్ షాను మంత్రిగా చేసిందని ప్రస్తావించారు. పాల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అమిత్ షా అందరూ సీఎంలతో మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో 1525 కొత్త కో ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

KISHAN-REDDY-1.jpg


పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

తమ ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు పూర్తి సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో విజయ డైరీపై పాడి రైతులు ఆధారపడి ఉన్నారని తెలిపారు. అముల్ డైరీకి గొప్ప చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఎంపీ రఘునందన్ రావు ప్రతిపాదన పెట్టగానే తాము అమలు చేశామని వివరించారు. రైతులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పాడి రైతులకు పాల మద్దతు ధర పెంచామని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బంది పడకుండా కొత్త ఆదాయ వనరులు వెతుక్కోవాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

KISHAN-REDDY-4.jpgKISHAN-REDDY-5.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 03:47 PM