Share News

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:54 PM

రామప్ప దేవాలయానికి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు, బ్లాస్టింగ్స్‌తో రామప్ప దేవాలయం, రామప్ప చెరువుకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
KTR

హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు దోచుకోవడం అయిపోయిందని.. ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపద దోచుకొని, వారసత్వ కట్టడాలను కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుందని ధ్వజమత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు.


రామప్పకు తీవ్ర ముప్పు..

రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. మీటర్ల కొద్ది లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని హెచ్చరించారు. వారసత్వ సంపదను ధ్వంసం చేసే ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్

వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 04:10 PM