తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:00 PM
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
ఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ప్రజాసంఘాలు, ఎన్జీవోలు, కుల సంఘాలకు, ఓట్లు గల్లంతైన వారి ఓట్లను పరిరక్షించుకునే విధంగా లేఖ రాస్తామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈరోజు (సోమవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరిగిందని చెప్పుకొచ్చారు.
‘సర్’ ప్రక్రియ అవకతవకలపై నిరంతర కార్యక్రమాలు..
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ‘సర్’ ప్రక్రియ అవకతవకలపై చర్చించామని తెలిపారు. రానున్న రెండు నెలల పాటు నిరంతర కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించామని అన్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడితోనే ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి..
వెంటనే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 8వ తేదీన లోక్‌భవన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్
వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News