కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:57 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో మోదీ చర్చించారు.
ఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో మోదీ చర్చించారు. ఈ సందర్భంగా ITLA ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధనకు ITLA రవాణా రంగాల అనుసంధానానికి జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
అలాగే, రైల్వేలు, రోడ్లు, పోర్టులు, ఏవియేషన్‌కు ప్రణాళికలను సిద్ధం చేసింది. భారీ మౌలిక ప్రాజెక్టుల పర్యవేక్షణకు ITLA ఏర్పాటు చేసింది. రూ.10 వేల కోట్లతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News