మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:56 PM
మెదక్ జిల్లా మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Telangana Governor Shiv Pratap Shukla) పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేటలో గవర్నర్ శుక్లా ఈరోజు (మంగళవారం) పర్యటించారు. మెదక్ - సిద్దిపేట నేషనల్ హైవే 765 DG వెంట జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. 45 కిలోమీటర్ల మేర జీడి మొక్కలు NHAI నాటనుంది.
నేషనల్ హైవే 765పై రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు జీడీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధించి తీరుతుందని తెలిపారు. గతంలో గ్రామాల్లో తుపాకుల గర్జనలు ఉండేవని చెప్పుకొచ్చారు. అలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించామని వెల్లడించారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News