Share News

మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:58 PM

తెలంగాణలో ‘మహిళా శక్తి’కి సరికొత్త వేదికలు రూపుదిద్దుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘మహిళా శక్తి’కి సరికొత్త వేదికలు రూపుదిద్దుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి ముస్తాబైన ‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు సరికొత్త నిలయాలుగా మారబోతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.


ఆడబిడ్డకు అవకాశమిస్తే.. ఒక కుటుంబం భవిష్యత్తు మారుతుంది..

మన స్వయం సహాయక సంఘాల మహిళా సోదరీమణులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల తయారీ నుంచి గ్లోబల్ మార్కెట్లలో విక్రయాల వరకు అవసరమైన ప్రతి అవకాశాన్ని ఒకే వేదికపై అందించేందుకు ఈ భవనాలు కీలక కేంద్రాలుగా నిలవనున్నాయని తెలిపారు. ఒక ఆడబిడ్డకు అవకాశం లభిస్తే.. ఒక కుటుంబం భవిష్యత్తు మారుతుందని ఉద్ఘాటించారు.


కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..

రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు పెరిగితే.. తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ‘మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి’ అనే ఆశయంతో.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ఊతమిస్తూ, తెలంగాణ ప్రగతి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 08:48 PM