సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 07 , 2026 | 08:26 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని ఇండియా కూటమి నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని విడుదల చేశారు. అయితే, ఆయనను కలిసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
రాహుల్ నాయకత్వంలో మా పోరాటం కొనసాగిస్తాం..
రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఈసీ, కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఈసీ, కేంద్ర విధానాలపై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలో అసహనం కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ఈడీ, సీబీఐని వాడుకున్నారని, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక మంది ఓట్లను సీఈసీ అకారణంగా తొలగించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News