అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:21 PM
రాజధాని అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి పనులపై మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. అమరావతి పనులపై ఈరోజు (మంగళవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ, పనులు చేస్తోన్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. గడిచిన నెలలో రాజధానిలో రూ.1,345 కోట్ల విలువైన పనులను నిర్మాణ సంస్థలు చేశాయని వెల్లడించారు.
ప్రతి నెలా రూ.2 వేల కోట్ల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాజధానిలో 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆయా నిర్మాణ సంస్థలు చేపట్టిన పనులను పురోగతిని సీఎం చంద్రబాబు సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News