టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:43 PM
నవరాత్రి బ్రహ్మోత్సవాలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాలతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రొటోకాల్ ప్రముకులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేసినట్లు వెల్లడించింది. NRI, డిఫెన్స్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల..
తిరుమలేశుడి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను రేపు (బుధవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రోజుకు 10వేల టికెట్ల చొప్పున విడుదల చేయనుంది.
తిరుపతిలో అధికారుల సంయుక్త తనిఖీలు..
తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసు, జిల్లా రవాణా శాఖల అధికారులు ఇవాళ (మంగళవారం) సంయుక్త తనిఖీలు నిర్వహించారు. తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో ఆటోలు, సుమోలు, జీపులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రయాణికుల మాదిరిగా మారువేషాల్లో వెళ్తూ అధిక ఛార్జీలు వసూలు చేసే వాహనాలను పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో 18 వాహనాలు (13 ఆటోలు, 3 సుమోలు, 2 జీపులు) స్వాధీనం చేసుకున్నారు. రూ. లక్ష జరిమానా విధించారు. అధిక ఛార్జీలు, ఓవర్ లోడింగ్, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్, పర్మిషన్లు లేకపోవడంపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News