Share News

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:39 PM

ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎంకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Tamil Nadu CM Vijay

అమరావతి, అక్టోబర్ 13: ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దర్శించుకున్నారు. ఈరోజు(మంగళవారం) దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న విజయ్‌కు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అన్నపూర్ణా దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను తమిళనాడు సీఎం దర్శించుకున్నారు. అనంతరం విజయ్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. దుర్గమ్మ ప్రసాదంతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని సీఎం విజయ్‌కు ఆలయ అధికారులు అందజేశారు.


కాసేపటి క్రితమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విజయ్‌కు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ స్వాగతం పలికారు. సీఎం విజయ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. సీఎం విజయ్ వెంట మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 04:59 PM