Share News

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:16 PM

ఏపీ పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు మంత్రి నారాయణ, అధికారులు స్వాగతం పలికారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం
Tamil Nadu CM Vijay

అమరావతి, అక్టోబర్ 12: ఏపీ పర్యటనలో భాగంగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణ సాదర స్వాగతం పలికారు. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం విజయ్ అభిమానులతో విమానాశ్రయం దద్దరిల్లింది. అభిమానులను చూసిన వెంటనే విజయ్.. కారు దిగి వారి వద్దకు వెళ్లి అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన సీఎం కాన్వాయ్ వెనుక అభిమానులు పరుగులు తీశారు. తమిళనాడు ముఖ్యమంత్రి రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


మరికాసేపట్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం విజయ్ దర్శించుకోనున్నారు. తరువాత ఏపీ సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశంకానున్నారు. గోదావరి-కృష్ణ-కావేరీ నదుల అనుసందానంతో పాటు, తెలుగు గంగ ఒప్పందం ప్రకారం చెన్నైకు తాగునీటి అంశంపై ఏపీ సీఎంతో తమిళనాడు సీఎం చర్చించనున్నారు. భేటీ తర్వాత పున్నమిఘాట్‌లోని విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విజయ్ హాజరవుతారు.


ఇవి కూడా చదవండి...

రాజమండ్రిలో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడు క్షేమం..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 04:40 PM