Share News

రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు: సబితా ఇంద్రారెడ్డి

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:50 PM

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పంటలు వేసుకోవద్దని అంటున్నారని మండిపడ్డారు.

రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు: సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పంటలు వేసుకోవద్దని అంటున్నారని మండిపడ్డారు. రైతులకు కరెంటు, సాగు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తాగు నీరు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెట్రో టెండర్లను రద్దు చేసిందన్నారు. కొత్తగా బుల్లెట్ ట్రైన్లు తీసుకువస్తామని అంటున్నారని.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ ఖరారు కాలేదని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారని తెలిపారు.


అలైన్‌మెంట్ ఖరారు కాకుండా భూ సేకరణ చేస్తే చట్టవిరుద్ధమని కేంద్ర మంత్రి చెప్పారని సబిత తెలిపారు. ఏ ఉద్దేశంతో బహదూర్‌గూడ భూములను తీసుకున్నారని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కొండగల్ నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నలుమూలలా వేల ఎకరాల భూములు తీసుకుంటున్నారని మాజీ మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భూదాహం ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కొత్వాల్ గూడ నుంచి కొడంగ‌ల్‌కు కొత్త రోడ్డు ఎందుకు వేస్తున్నారని నిలదీశారు. భూములు అమ్మి పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు. నాదర్ గుల్ భూములు ప్రభుత్వ భూములని.. కానీ వాటిని ప్రైవేటు వాళ్లు వచ్చి ఆక్రమిస్తున్నారన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సబితా ఇంద్రారెడ్డి హితవుపలికారు.


ఇవి కూడా చదవండి...

రాహుల్‌‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్

‘15 రోజుల్లో కారుణ్య నియామకాలు’.. సింగరేణి కార్మికులకు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 01:55 PM