Share News

ఓరినాయనో.. ఎల్‌నినో..పత్తి రైతులను భయపెడుతున్న వర్షాభావ పరిస్థితులు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:57 AM

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వానలు కురవక పోవడంతో పత్తి పంట చేతికొచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఓరినాయనో.. ఎల్‌నినో..పత్తి రైతులను భయపెడుతున్న వర్షాభావ పరిస్థితులు
El Nino Impact, Drought

  • వాడుతున్న పంటలు.. రాలుతున్న కాయలు

  • పెట్టుబడులు కూడా రాని దుస్థితి

  • ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

వరంగల్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వానలు కురవక పోవడంతో పత్తి పంట చేతికొచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు నెలలుగా అడప దడపా తప్ప భారీ వర్షాలు లేక భూమి తడారిపోయింది. కా యలు పక్వానికి రాకముందే నల్లబారి రాలిపోతున్నాయి. పంట చేతికొస్తుందో లేదోనని దిగులు చెందుతు న్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుం టున్నారు. వానాకాలం సీజన్‌ ఆరంభంలో కురిసిన వానలకు రైతులు పత్తి విత్తనాలు నాటారు. అడపాదడపా కురిసిన వానలకు పత్తి కాస్త పచ్చబడింది. ఆ తర్వాత ఆగస్టులో వరుణుడు కరుణించలేదు.


సెప్టెంబ ర్‌లో ఒకటి రెండు సార్లు వానలు పడ్డా యి. అయినా పంటకు సకాలంలో నీరు అందకపోవడంతో పత్తి పంట వాడుము ఖం పట్టింది. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూమిలోని తేమ శాతం తగ్గిపోయి పత్తి మొక్కలు వాడిపో యాయి. కాయలు పక్వానికి రాక ముందే నల్లగా మారి రాలిపోతున్నాయి. దీనికితో డు ఎర్రగుమ్మడి తెగులుతో పంటంతా ఎండిపోతోంది. వరంగల్‌ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలు సాగు చేస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా పత్తిని అధికంగానే సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.


hnk1.2.jpgపెరిగిన ధరలు

రైతులకు పత్తిసాగు మరింత భారమైంది. యూరియా, డీఏపీ, పొటాష్‌, ట్రాక్టర్‌ కిరాయి, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి పెరిగిపో యింది. రెండు కిలోల పత్తి విత్తనాల బ్యాగు గత రెండేళ్లుగా రూ.901లకు విక్రయిస్తున్నారు. యూరియా ధర గతేడాది మాదిరిగానే ఉండగా, డీఏపీ, పొటాష్‌ మిగతా రసాయనిక ఎరువులు అధికమయ్యాయి. డీజిల్‌ ధర పెరగడంతో ట్రాక్టర్‌ యజమా నులు కిరాయి పెంచేశారు. గతేడాది ట్రాక్టర్‌ తో గంటపాటు దున్నితే రూ.130 తీసుకోగా, ఈ ఏడాది రూ.1500 తీసుకుంటున్నారు. గతంలో రోజు కూలీ రూ.500 తీసుకోగా ఈసారి రూ.700 తీసుకున్నారు. గతేడాది కలుపుతీతకు రోజుకు రూ.650 తీసుకోగా, ఈ ఏడాది రూ.800 తీసుకున్నారు. ఇపుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంట నష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభు త్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


కరెంట్‌ కోతలతో ఇక్కట్లు..

ఇప్పటికే వర్షాలు లేక సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇపుడు విద్యుత్‌ కోతలు శాపంగా మారాయి. బోర్ల్ల కింద, బావుల కింద, కాలువల కింద నీటి సౌకర్యం ఉన్న దగ్గర పంటలకు సకాలంలో నీళ్లు పెడుదామంటే కరెంట్‌ ఉండడంలేదు. వ్యవసాయ కనెక్షన్లకు త్రీఫేజ్‌ కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోయింది. లైన్‌రెస్ట్‌ పేరిట అనధికార కోతలు విధిస్తున్నారు. నాణ్యమైన కరెంట్‌ రాక మోటర్లు మొరాయిస్తున్నాయి.


పంట చేతికొస్తదనే నమ్మకం లేదు

  • బాలె చేరాలు, రైతు, కల్లెడ

ఐదు ఎకరాలలో పత్తి పంట సాగు చేశాను. పెట్టుబడి కోసం రూ.4లక్షల వరకు అప్పులు చేశాను. సకాలంలో వర్షాలు కురియక పోవడంతో పంట ఎండు ముఖం ప ట్టింది. పంట చేత కందుతుందనే న మ్మకం లేదు. అప్పులు ఎలా తీర్చాలో తోచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

గ్రామాల్లో గంజాయి ఘాటు

కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 12:05 PM