కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:49 AM
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్, అక్టోబర్ 13: నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. చేతిలో కూతురితో రైలు ఎక్కబోయిన ఓ వ్యక్తి పట్టుతప్పి ఆ రైలు కిందే పడబోయాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనాకుమారి.. సదరు వ్యక్తిని పక్కకు లాగారు. దీంతో తండ్రి, కూతురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనను గమనించిన వెంటనే లోకో పైలట్ అత్యవసర బ్రేక్‌లు వేసి రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అనంతరం భార్య, కూతురిని సదరు వ్యక్తి సురక్షితంగా రైలు ఎక్కించడంతో సుఖాంతమైంది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రీనాకుమారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని పలువురు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి
Read Latest Telangana News And Telugu News