Share News

కేంద్ర బలగాలను మోహరించండి

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:50 AM

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కేంద్ర బలగాలను మోహరించండి

  • హైకోర్టులో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్‌

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమించిన స్వతంత్ర ఎన్నికల పరిశీలకుల సూచనలకు అనుగుణంగా బలగాలు నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తూ.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర సా యుధ బలగాలను మోహరించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎస్‌ఈసీ నుంచి ఎలాంటి స్పందనా లేదని పిటిషన్‌లో వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర హోం కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు.

నామినేషన్లు వేసేవారికి భద్రత కావాలి

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురజాల నియోజకవర్గం పరిధిలో నామినేషన్లు వేసే అభ్యర్ధులకు భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:50 AM