ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:37 AM
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం పీజీఆర్‌ఎస్ విధానం ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించగలుగుతున్నామని, మరింత వేగంగా, సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని సీఎస్ సాయి ప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు... ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పరిష్కరించే విషయంలో ఉద్యోగులకు, అధికారులకు జవాబుదారీతనం ఉండేలా చూడాలన్నారు. వివిధ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోపై ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ... ఎప్పటికప్పుడు సమర్థంగా సరైన సమాచారం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: