శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:55 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలం అని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 13: శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలం అని తెలిపారు. దశాబ్దాలుగా లక్షలాది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలను శ్రీశైలం జలాశయం తీరుస్తోందని చెప్పారు. భారీ వరదలను తట్టుకున్న శ్రీశైలం డ్యామ్ నిర్మాణ పటిష్ఠతకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆనందదాయకమన్నారు.
సీఎం చంద్రబాబు ముందుచూపుతో పట్టిసీమ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల రాయలసీమకు శ్రీశైలం జలాల వినియోగంలో ఎంతో ప్రయోజనం కలిగిందని మంత్రి వెల్లడించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 500 టీఎంసీల నీటిని అందించడంతో శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలిగిందన్నారు. కృష్ణా డెల్టా రైతులకు నీరందిస్తూనే రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు శ్రీశైలం జలాశయం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. జలవనరుల సమర్థ వినియోగం, ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వడంలో చంద్రబాబు దూరదృష్టి స్పష్టమవుతోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇంజినీరింగ్ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, బహుముఖ ప్రయోజనాలకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు నిదర్శనమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్
Read Latest AP News And Telugu News