Share News

గ్రామాల్లో గంజాయి ఘాటు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:03 AM

గ్రామాల్లో గంజాయి వాడకం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు.

గ్రామాల్లో గంజాయి ఘాటు
Ganja, Karimnagar

  • నిర్మానుష్య ప్రదేశాలే అడ్డా

వీణవంక(కరీంనగర్): గ్రామాల్లో గంజాయి వాడకం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ వ్యసనం ఇప్పుడు పల్లెల్లోకి పాకింది. స్నేహితుల ఒత్తిడి, ఒత్తిడి సులభంగా దొరకడం, అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది యువకులు ఉచ్చులో చిక్కుకుంటున్నారు.


  • పండుగపూట అమ్మకాలు

దసరా పండుగ సందర్భంగా పల్లెలకు గంజా యి చేరినట్లు చర్చ జరుగుతోంది. జమ్మికుంట రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా గ్రామాల్లోకి గంజాయి సరఫరా చేసినట్లు సమాచారం. రైల్వేస్టేషన్‌లో సరైన నిఘా లేకపోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల నుంచి తీసుకు వచ్చి విక్రహి స్తున్నారు. వీణవంక, చల్లూరు, నర్సింగాపూర్‌, కొండపాక, రెడ్డిపల్లి, కొర్కల్‌, బేతిగల్‌, ఘన్ముక్ల వంటి గ్రామాల్లో కొంత మంది యువతను టార్గెట్‌ చేసి ఈ మత్తులోకి దింపుతున్నట్లు సమాచారం.


  • నామమాత్రంగా తనిఖీలు

మండలంలో విచ్చల విడిగా గంజాయి అమ్మకా లు జరుగుతున్నా ఎక్సైజ్‌శాఖ నామమాత్రపు తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారు. పోలీసులు తరు చూ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నా ఆగడం లేదు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు సిగిరేట్‌, చాక్లెట్‌ రూపంలో విక్రహి స్తున్నారు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు గం జాయి బానిసలుగా మారుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలే అడ్డాలుగా మార్చుకుని గంజాయిని సిగిరెట్లలో నింపుకుని వినియోగిస్తున్నారు. 50 గ్రాముల గంజాయి రూ. 250 నుంచి రూ. 300 వరకు విక్రయి స్తున్నట్లు సమాచారం.


vnk1.jpg

  • అడ్డుకట్ట వేయాలి

గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతున్న గంజాయి వినియోగంపై అధికారులు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గంజాయి వినియోగాన్ని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టా లని ప్రజలు కోరుతున్నారు. మత్తుకు బానిసలై యువత గ్రామాల్లో విచ్చలవిడిగా ప్రవ ర్తిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. పలు పాన్‌షాప్‌లు, బెల్ట్‌షాప్‌లు కిరాణా షాపులలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టు సమాచారం.


ఇప్పటికైనా టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌ అధికారులు గంజాయికి బానిసలైన యువకులపై నిఘా పెడితే అసలు రవాణా ఎక్కడి నుంచి సాగు తుందో తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. యువత మత్తుకు బానిసలు కాకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో తని ఖీలు చేయాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 11:03 AM