నార్సింగి నుంచి అమెరికన్లకు వల!
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:54 AM
అమెరికా పౌరులను లక్ష్యం చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ నార్సింగిలోని ఓ కాల్ సెంటర్ గుట్టురట్టయింది.
రెండు ఫ్లాట్లలో సైబర్ కాల్ సెంటర్
పేపాల్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు
యాపిల్ గిఫ్ట్ కార్డులు, క్రిప్టో ద్వారా వసూళ్లు
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దాడులు
లావాదేవీల్లో 9 మంది ఉన్నట్లు గుర్తింపు..
10 ల్యాప్‌టాప్‌లు, 13 ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: అమెరికా పౌరులను లక్ష్యం చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ నార్సింగిలోని ఓ కాల్ సెంటర్ గుట్టురట్టయింది. అంతర్జాతీయ ఆన్‌లైన్ చెల్లింపుల ప్లాట్‌ఫాం అయిన ‘పేపాల్’ కస్టమర్ కేర్ సెంటర్ పేరుతో అమెరికన్లకు నకిలీ ఈ మెయిళ్లు పంపుతూ సాంకేతిక సమస్యల పరిష్కారం పేరుతో ఈ కాల్ సెంటర్ నిర్వాహకులు భారీగా డబ్బులు దండుకున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో నార్సింగి కట్టర్ పిల్లర్ రోడ్డులోని ఓ రెసిడెన్సీలోని 401, 402 ఫ్లాట్లలో తనిఖీలుచేసి 10 ల్యాప్‌టాప్‌లు, 13 మొబైల్ ఫోన్లు, ఏడు హెడ్‌ఫోన్లు, మూడు వైఫై రౌటర్లు, ఏడు ఛార్జర్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్నాన్ అహ్మద్, సయ్యద్ బలావల్ ఇమామ్ అలియాస్ షాదాబ్‌తో కలిసి 2025 ఫిబ్రవరి నుంచి నార్సింగిలోని ఓ రెసిడెన్సీలో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తొలుత బెంగళూరులో ప్రారంభించి, ఆ తర్వాత కోల్‌కతాకు దీనిని మార్చారు. 2026 సెప్టెంబరు 1 నుంచి నార్సింగిలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్లలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. టెలీకాలర్లను నియమించుకుని, వారికి వసతి, భోజనం, జీతంతో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చేవారు.
ఈ-మెయిళ్లకు నకిలీ సందేశాలు పంపి..
అమెరికా పౌరుల ఈ-మెయిల్ వివరాలు సేకరించి, వారి పేపాల్ ఖాతాల్లో అనధికార లావాదేవీలు జరిగినట్లు నకిలీ సందేశాలు పంపేవారు. 8 గంటల్లో రీఫండ్ పొందాలంటే ఈమెయిల్‌లో ఇచ్చిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించేవారు. కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ వస్తువు మరమ్మతు లేదా సాఫ్ట్‌వేర్ సమస్య ఉందంటూ మెయిళ్లు పంపి, సహాయం పేరుతో బాధితులను ఫోన్ చేసేలా సువో మండల్ అనే వ్యక్తి చేసేవాడు. బాధితుల నుంచి వచ్చిన కాల్స్‌ను ల్యాప్‌టాప్‌లలో మైక్రోసిప్ యాప్, మొబైల్ ఫోన్లలో పోర్ట్‌సిప్ యాప్ ద్వారా రిసీవ్ చేసుకునేవారు. సమస్య పరిష్కరించాలంటే ముందుగా చార్జీలు చెల్లించాలని
ఓఎల్‌ఎక్స్‌లో వచ్చిన ప్రకటన ప్రకారం విక్రయదారుడిని సంప్రదించారు. వస్తువులు పంపిస్తామని నమ్మించిన వ్యక్తులు చెల్లింపులు అందలేదంటూ పలుమార్లు అతని ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఇలా విడతలవారీగా మొత్తం రూ.4,38,995లు చెల్లించినా వస్తువులు గానీ, డబ్బులు గాని తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News