Share News

అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ల కలకలం

ABN , Publish Date - Oct 13 , 2026 | 07:03 AM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9:40 గంటల సమయంలో 2-3 డ్రోన్లు ..

అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ల కలకలం

అమృత్‌సర్‌, అక్టోబరు 12: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి 9:40 గంటల సమయంలో 2-3 డ్రోన్లు విమానాశ్రయ పరిసరాల్లో ఎగురుతున్నట్లు గుర్తించిన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రాత్రి 9:50 గంటలకు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఆకస్మిక నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌ వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని (ఏఐ-855) తిరిగి ఢిల్లీకే పంపించివేశారు. అలాగే ముంబై నుంచి రావాల్సిన ఇండిగో విమానాన్ని (6ఈ-5028) చండీగఢ్‌కు మళ్లించగా, కౌలాలంపూర్‌ నుంచి వస్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్‌ అంతర్జాతీయ విమానాన్ని (ఎమ్‌హెచ్‌-118) దేశ రాజధానికి తరలించారు.

Updated Date - Oct 13 , 2026 | 07:03 AM