Share News

3 కేసుల్లో రూ. 3 కోట్లు.. ఆన్‌లైన్‌ మోసాలకు బాధితుల విలవిల

ABN , Publish Date - Oct 13 , 2026 | 09:02 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ, తక్కువ ధరకు ఎలక్ట్రానిక్‌ వస్తువులు లభిస్తాయంటూ సైబర్‌ నేరగాళ్లు ముగ్గురిని మోసగించారు.

3 కేసుల్లో రూ. 3 కోట్లు.. ఆన్‌లైన్‌ మోసాలకు బాధితుల విలవిల
Cyber Crime, Hyderabad

  • ట్రేడింగ్‌ పేరుతో ఇద్దరికి రూ.2.97 కోట్లకు పైగా నష్టం

  • ల్యాప్‌టాప్‌ కొనుగోలు వేటలో రూ.4.38 లక్షల మోసం

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ, తక్కువ ధరకు ఎలక్ట్రానిక్‌ వస్తువులు లభిస్తాయంటూ సైబర్‌ నేరగాళ్లు ముగ్గురిని మోసగించారు. రెండు ట్రేడింగ్‌ మోసాల్లో ఇద్దరు బాధితులు మొత్తం రూ.2.96 కోట్లకు పైగా నష్టపోగా, ఓఎల్‌ఎక్స్‌ ద్వారా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయబోయిన మరో యువకుడు రూ.4.38 లక్షలు కోల్పోయాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


అప్‌స్టాక్స్‌ పేరుతో రూ.11.26 లక్షలు

దుండిగల్‌కు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి అప్‌స్టాక్స్‌ ప్రతినిధులమంటూ వాట్సాప్‏లో పరిచయమైన వ్యక్తులు అతన్ని ‘ఉట్రేడ్‌ డీఎంఏ’ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించి, వివిధ సంస్థల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించారు. మొత్తం ఏడు లావాదేవీల్లో రూ.11,31,997లు చెల్లించగా.. సుమారు రూ.36 లక్షల లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపిస్తూ, దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి మరో రూ.25.90 లక్షలు చెల్లించాలని కోరినట్లు ఆరోపించారు. తన పెట్టుబడిలో రూ.5వేలు మాత్రమే తిరిగి వచ్చాయని, రూ.11,26,997లు నష్టపోయానని బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ల్యాప్‌టాప్‌ కోసం..

కొండాపూర్‌కు చెందిన 29 ఏళ్ల సిరువూరి వినీత్‌వర్మ ల్యాప్‌టాప్‌, ఫర్నిచర్‌ కొనుగోలు కోసం ఓఎల్‌ఎక్స్‌లో వచ్చిన ప్రకటన ప్రకారం విక్రయదారుడిని సంప్రదించారు. వస్తువులు పంపిస్తామని నమ్మించిన వ్యక్తులు చెల్లింపులు అందలేదంటూ పలుమార్లు అతని ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఇలా విడతలవారీగా మొత్తం రూ.4,38,995లు చెల్లించినా వస్తువులు గానీ, డబ్బులు గాని తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.


city4.jpgట్రేడింగ్‌ పేరిట రూ.2.85 కోట్లు

మణికొండలోని ల్యాంకోహిల్స్‌లో నివసించే 62 ఏళ్ల మహిళను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. ఆమె ఖాతా నుంచి రూ.2.85 కోట్ల మేర కాజేశారు. వాట్సాప్‌, మెసెంజర్‌ గ్రూపుల ద్వారా బాధితురాలికి పరిచయమైన వ్యక్తులు షేర్ల కొనుగోలు, విక్రయాలపై సూచనలు ఇస్తూ ఆమెను పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఆమెను నకిలీ ఎంస్టాక్‌ ఫోర్బ్స్‌ఈఎంఎఫ్‌ డాట్‌కమ్‌ వెబ్‌సైట్‌లో చేర్చి ట్రేడింగ్‌ చేయించారు.


జూలై 27 నుంచి అక్టోబరు 7 వరకు 16 లావాదేవీల్లో మొత్తం రూ.2,85,50,000 ఆమె ట్రేడింగ్‌ కోసం బదిలీ చేసింది. అయితే, ఆ మొత్తానికి రూ.4,14,22,856 లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలంటే మరో రూ.80 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మరికొంచెం తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 09:02 AM