Share News

రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్

ABN , Publish Date - Oct 13 , 2026 | 07:32 AM

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు ఏసీబీ వలకు చిక్కారు.

రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్
Hyderabad Abdullapurmet ACB RaidS

హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు ఏసీబీ వలకు చిక్కారు. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే చేసి జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు తహసీల్దార్, సర్వేయర్ లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు.


తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా సర్వేయర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో సర్వేయర్ చేతివేళ్లకు పాజిటివ్ ఫలితం వచ్చింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ ఈ లంచం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు అధికారులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 07:58 AM