Share News

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:22 PM

సర్‌ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పిలుపుతో ఢిల్లీలో నిరసనకు దిగారు. సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

ఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సర్‌(ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పిలుపుతో ఢిల్లీలో నిరసనకు దిగారు. సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.


అర్హులైన ఓటర్లను సీఈసీ తొలగించింది: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’ ఉపయోగించుకొని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని.. అర్హులైన ఓటర్లను తొలగించిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. సర్‌ను రద్దు చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారని వ్యాఖ్యానించారు. సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహించారు. ఎన్నికల కార్యాలయం పక్షపాతం చూపిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే, పిలుపుతో ప్రజాస్వామ్య గొంతును వినిపించేందుకు తాము ఢిల్లీ వచ్చామని తెలిపారు. కేంద్రం, సీఈసీపై తమ నిరసన తెలియజేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


ఆయా రాష్ట్రాల్లో దొంగదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: మంత్రి శ్రీహరి

Telangana Minister Vakiti Srihari

బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడి ఓటు హక్కును కాపాడేలా తాము పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపుమేరకు తాము ఢిల్లీకి వచ్చామని వెల్లడించారు. ‘సర్’ ద్వారా ఓట్లు తొలగించి.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అన్ని చోరీలు అయిపోయాయని.. ఇప్పుడు ఓట్ల చోరీ చేస్తోందని ఆగ్రహించారు. దొంగ దారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి దుయ్యబట్టారు.


సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు ఆందోళన చేస్తాం: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు తాము ఆందోళన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా ‘సర్’ను వాడుకొని ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. అధికారంలో ఎప్పటికీ ఉండాలనే ఆకాంక్షతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇంత పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నా.. వారు కనీసం స్పందించట్లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు అందరూ ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ప్రజాస్వామ్యంలో ఓటును తొలగించడం తప్పు: ఎంపీ చామల

chamala copy.jpg

ప్రజాస్వామ్యంలో ఓటును తొలగించడం తప్పు అని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ బీజేపీకి వత్తాసు పలుకుతూ అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలను ఎన్నికల కమిషనర్లుగా తీసుకువచ్చి కేంద్ర ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారని మండిపడ్డారు. 50 ఏళ్లు అధికారంలో ఉండాలనే పిచ్చి ఆలోచనతో బీజేపీ ఇలాంటి పనులు చేసిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 01:09 PM