తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:26 PM
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి జగిత్యాలలో ప్రమాదం జరిగింది. ఆదివారం ప్రైవేట్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి అడ్లూరి వచ్చారు.
జగిత్యాల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Telangana Minister Adluri Lakshman) సిబ్బందికి జగిత్యాలలో ప్రమాదం జరిగింది. ఈరోజు (ఆదివారం) ప్రైవేట్ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి అడ్లూరి వచ్చారు. ముందుగా లిఫ్ట్‌లో పై అంతస్తుకు ఆయన చేరుకున్నారు. రెండో ట్రిప్‌లో సిబ్బంది పైకి వెళ్తుండగా లిఫ్ట్ వేగంగా కిందకు పడిపోయింది.
ఆ లిఫ్ట్‌లోనే ముఖ్య నాయకులు, గన్‌మెన్లు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ప్రైవేట్ ఆస్పత్రిలో మంత్రి అడ్లూరికి లిఫ్ట్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే జగిత్యాలలో మరో లిఫ్ట్ ఘటన చోటుచేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర
జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్
203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News