203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:44 PM
ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు పరిధిలో అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఆ ట్రస్టు చర్యలు చేపట్టింది. 203 హాస్పిటల్స్‌పై రూ.34.39 కోట్ల జరిమానాలను ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు విధించింది.
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు (NTR Vaidya Seva Trust) పరిధిలో అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఆ ట్రస్టు చర్యలు చేపట్టింది. 203 హాస్పిటల్స్‌పై రూ.34.39 కోట్ల జరిమానాలను ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు విధించింది. 2024–25 నుంచి 2026–27 వరకు 203 ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆయా హాస్పిటల్స్‌పై 25 సస్పెన్షన్లు.. 13 చెల్లింపులను నిలిపివేసింది. ఐదు ఆస్పత్రులను నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించగా.. మరో హాస్పిటల్ గుర్తింపును రద్దు చేసింది. గడచిన ఆరు నెలల్లో 114 కేసుల్లో చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే వైద్య సేవల్లో లోపాలు, అనుమానాస్పద బిల్లులపై ట్రస్టు నిఘా పెట్టింది.
ఉచిత వైద్యానికి డబ్బులు వసూలు చేస్తే ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు హెచ్చరించింది. అర్హులకు నగదు రహిత వైద్యం నిరాకరించినా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. రోగుల ఫిర్యాదులపై విచారించి వైద్య రికార్డులను పరిశీలించింది. ఆయా బిల్లుల పరిశీలనకు కృత్రిమ మేథ ఆధారిత సాంకేతికత వినియోగించనుంది. ఏఐ ద్వారా అనుమానాస్పద బిల్లుల గుర్తింపు.. ఆధారాలతో నిర్ధారణ తర్వాతే చర్యలు చేపట్టనుంది. రోజుకు 6 వేల ముందస్తు వైద్య అనుమతి అభ్యర్థనలను పరిశీలించనుంది.
రోజుకు 5,600 చికిత్సల బిల్లులను ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు తనిఖీ చేయనుంది. ముందస్తు అనుమతులకు రెండు దశల్లో.. బిల్లులకు నాలుగు దశల్లో తనిఖీలు చేయనుంది. ఈ క్రమంలో ఆయా బిల్లుల పరిశీలనను వేగవంతం చేసింది. పెండింగ్ బిల్లుల పరిష్కారంపై దృష్టిసారించింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ వివరాలతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు సీఈఓ పద్మావతి నివేదిక అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News