ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:44 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (Droupadi Murmu) ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు (శుక్రవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని లేఖలో ప్రస్తావించారు.
ఓటర్ల జాబితాలను బీజేపీ తారుమారు చేసింది..
ఈవీఎంలు, ఓటర్ల జాబితాలను బీజేపీ తారుమారు చేసిందని ఎంపీలు ఆగ్రహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘సర్’ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలని పట్టుబట్టారు.
గత రెండేళ్ల అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి..
దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఓట్ల చోరీకి సంబంధించి నిర్ధారిత ఆధారాలు సమర్పించిన గత రెండేళ్ల అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇండియా కూటమి ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్
మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News