జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:27 PM
: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రోజువారీ విచారణ జరిపి వేగంగా ఈ కేసులను తేల్చాలని అధికారులు పిటిషన్‌లో కోరారు.
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. రోజువారీ విచారణ జరిపి వేగంగా ఈ కేసులను తేల్చాలని అధికారులు పిటిషన్‌లో కోరారు. జగన్ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరయ్యేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టులో తొమ్మిది ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకెళ్లట్లేదని తెలిపారు. ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక రంగానికే ముప్పుగా పరిగణించాలని కోరారు.
ఈడీ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపిన విషయం తెలిసిందే. జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ పిటిషన్ దాఖలైనట్లు హైకోర్టు గుర్తించింది. హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి పిటిషన్‌ను జత చేయాలని న్యాయస్థానం ఈడీ అధికారులను ఆదేశించింది. జగన్ కేసులను వేగంగా విచారణ జరపాలనే అన్ని పిటిషన్లను కలిపి ఈనెల 13వ తేదీన తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News