హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 07:03 AM
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా సబ్‌స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సీబీడీ రాజేందర్ సింగ్ తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా సబ్‌స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సీబీడీ రాజేందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌలిపురా, మెతర్‌వాడి, జంగమ్మెట్, శారద కాలేజీ, సుల్తాన్‌షాహీ, నషేమాన్‌నగర్, ఖాన్‌నగర్, మొగల్‌పురా పీఎస్, జంగమ్మెట్, ఫలక్‌నుమా ఖాద్రిచమన్, శివాజీనగర్, రాజన్నబావి, ఆలియాబాద్, శంషీర్‌గంజ్, ఇంజన్‌బౌలి, లాల్‌దర్వాజ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుల్తాన్‌షాహీ, తలాబ్‌కట్ట, మీర్‌కాదాహర, హరిబౌలి, బేలా, ఘాజిమిల్లత్ కాలనీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమాబ్రిడ్జి, రవీంద్రనాయ క్, ఇంజన్‌బౌలి, గాంధీనగర్, ఫలక్‌నుమా స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు.. విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. చిక్కడపల్లి, కెఎంఐటి, తాళ్ళబస్తీ, రెడ్‌రోజ్, విజయ ఆసుపత్రి ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, నారాయణగూడ, గాంధీనగర్, ఐసీ క్వార్టర్స్, సత్యం కంప్యూటర్స్ ప్రాంతాల పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆర్‌వోఎం పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.
పంజాగుట్ట: గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామ్‌నగర్, పాటిగడ్డ క్వార్టర్స్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సారథినగర్, బేగంపేట పైగా ప్యాలెస్, సంజీవయ్య పార్క్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
రాయదుర్గం: పీజేఆర్, టెలికాంనగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివ కృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెలికాంనగర్, గచ్చిబౌలిలో కరెంట్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.
ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News