భారత ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ బాధ్యతలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:46 AM
భారత సైన్యానికి కొత్త బాస్ వచ్చారు. 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీకి 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించి రిటైర్ అయిన జనరల్...
న్యూఢిల్లీ, జూన్ 30: భారత సైన్యానికి కొత్త బాస్ వచ్చారు. 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీకి 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించి రిటైర్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎ్‌స)గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన వైస్ చీఫ్ ఆప్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు. జనరల్ ధీరజ్ సేథ్ ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆర్మీ చీఫ్‌గా నియమితులు కావడానికి ముందు ఆయన పుణె కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్‌కు నేతృత్వం వహించారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!