Share News

కేంద్ర సర్వీసులకు సత్యయేసుబాబు

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:06 AM

రాష్ట్రానికి చెందిన ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సత్యయేసుబాబు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.

కేంద్ర సర్వీసులకు సత్యయేసుబాబు

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సత్యయేసుబాబు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 2010 బ్యాచ్‌కు చెందిన యేసుబాబు రైల్వే డీఐజీ విధులతోపాటు, పోలీసు శిక్షణ కేంద్రం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయన కేంద్ర సర్వీస్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అనుమతి కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇకపై సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా ఆయన దేశానికి సేవలందించనున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 06:07 AM